బాంబ్‌ డిటోనేట్‌ సస్పెక్ట్‌: తేలనున్న భవితవ్యం

- September 08, 2018 , by Maagulf
బాంబ్‌ డిటోనేట్‌ సస్పెక్ట్‌: తేలనున్న భవితవ్యం

బహ్రెయిన్: 2014లో డెమిస్తాన్‌లో బాంబు పేలుడుకు యత్నించిన ప్రధానమైన వ్యక్తిని ఇన్వెస్టిగేటర్స్‌ ఎట్టకేలకు గుర్తించారు. ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని, నిందితుడ్ని హై క్రిమినల్‌ కోర్ట్‌ ముందుకు రిఫర్‌ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్‌ 26న వెల్లడి కానుంది. 2014 సెప్టెంబర్‌లో ఈ ఘటన జరిగింది. ఓ అనుమానాస్పద వస్తువు తగలబడ్తుండగా దాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాన్ని బాంబుగా గుర్తించడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ బాంబును పేల్చేందుకు ఎవరు యత్నించిందీ తేలలేదు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసులో నిందితుడ్ని అరెస్ట్‌ చేయగలిగారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com