ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై మరణ శిక్ష: ఈజిప్టు కోర్టు

- September 08, 2018 , by Maagulf
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై మరణ శిక్ష: ఈజిప్టు కోర్టు

కైరో: ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2013లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న దాదాపు 75 మందికి ఈజిప్టు కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. ఈ శిక్ష పడిన వారిలో నిషిద్ధ ''ముస్లిం బ్రదర్‌హుడ్‌'' సంస్ధకు చెందిన వారు కూడా ఉన్నారు. కైరోలోని క్రిమినల్‌కోర్టు విధించిన ఈశిక్ష ఈజిప్టు ఉన్నతాదికారి గ్రాండ్‌ ముఫ్తీ పరిశీలనకు వెళ్ళింది. కోర్టు తీర్పును కాదనే అధికారం ఆయనకున్నప్పటికీ, ఈ తీర్పును నిర్థారించారు. ముస్లిం బ్రదర్‌హుడ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న మహమ్మద్‌ బడెయితో సహా దాదాపు 739 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. షాకన్‌గా అందరికి తెలిసిన ఫొటో జర్నలిస్టు మహ్మద్‌ అబు జియద్‌ కూడా వీరిలో ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు సంబంధించిన వార్తను సేకరించేందుకు వెళ్ళిన జర్నలిస్టు జియద్‌ 2013 నుండి జైలులోనే ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com