శశికపూర్ కు దాదా ఫాల్కే పురస్కారం ప్రదానం
- May 10, 2015
బాలీవుడ్ ప్రముఖ నటుడు శశికపూర్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు. ఆదివారం పశ్చిమ ముంబైలోని ఫృధీ థియేటర్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శశికపూర్ కు అరుణ్ జైట్లీ అందజేశారు. ఈ కార్యక్రమానికి శశికపూర్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటీనటులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 2013 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం శశికపూర్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శశికపూర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను పురస్కారం అందుకోవడానికి న్యూఢిల్లీ రాలేనని ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దాంతో ఆదివారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదగా శశికపూర్ దాదా ఫాల్కే పురస్కారం అందుకున్నారు. 2011లో శశికపూర్ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









