'ఎన్నారై' లకి ట్రంప్ మరో షాక్
- September 10, 2018
అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాకి అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తరువాత తన తలతిక్క ప్రవర్తనతో అటు అమెరికాకి ఇటు అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలకి పెద్ద తలనెప్పిగా మారిపోయాడు..అమెరికా అభివృద్దిలో ప్రముఖ పాత్ర పోషించేది కేవలం ఇతర దేశాల నుంచీ వలసలు వెళ్ళిన ఎన్నారైలే ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ట్రంప్ ఎన్నికల హామీల అమలులో భాగంగా హెచ్1 బీ పై విధించిన నిభందనలు అన్నీ ఇన్నీ కావు ఈ దెబ్బతో అమెరికాలో ఉన్న ఎన్నారైలు తట్టా బుట్టా సర్దేసుకోవడమే అనుకున్న సందర్భంలో ట్రంప్ మరొక పిడుగు లాంటి వార్తా వినిపించాడు అదేంటంటే..
అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈబీ-5వీసా...ఈ వీసా కోసం హెచ్1 బీ వీసా దారులు ఎంతో పోటీ పడుతున్న సమయంలో ఈబీ-5వీసా పై కూడా నిభందనలు కఠినతరం చేయనున్నారని వార్తలు వెలువడ్డాయి...ఈ వీసా లో పెట్టుబడిని 5మిలియన్ డాలర్లకు పెంచనున్నారని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఆరోన్ స్కాక్ చెబుతున్నారు. అయితే, పెట్టుబడి పెంపునకు సంబంధించి ఈ ఏడాది డిసెంబరు వరకూ ఎలాంటి మార్పు ఉండబోందని అంటున్నారు.
ఈ క్రమంలో శాశ్వత పౌరసత్వం కలిగే ఏకైక మార్గం ఈబీ-5వీసా కల కలగానే మిగిలిపోనుంది అంటున్నారు. కనీసం ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 10మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తేఅ.. గ్రీన్‌కార్డును ప్రభుత్వం వారికి ఇస్తుంది అయితే..త్వరలో ఈబీ-5 విషయంలోనూ నిబంధనలకు కఠినతరం చేయనున్నారట.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







