దొంగతనాన్ని అడ్డుకున్న భారతీయులకి సన్మానం

- September 10, 2018 , by Maagulf
దొంగతనాన్ని అడ్డుకున్న భారతీయులకి సన్మానం

మస్కట్‌: ముగ్గురు భారతీయ వలసదారులకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సన్మానం చేసింది. అల్‌ బతినాలో ఓ దొంగతనాన్ని అరికట్టడంలో ఈ ముగ్గురూ చూపిన చొరవకు ఈ గౌరవం దక్కింది. మాల్‌లో దొంగతనానికి పల్పడిన నిందితుల్ని పట్టుకునే క్రమంలో వలసదారులు పోలీసులకు సహాయ సహకారాలు అందించారు. నిందితులు గ్లాస్‌ డోర్‌ నుంచి కమర్షియల్‌ సెంటర్‌లోకి అడుగు పెట్టినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ - అల్‌ సువైక్‌ పోలీస్‌ స్టేషన్‌ వెల్లడించింది. వారిని అరెస్ట్‌ చేసేందుకు వలసదారులు సహకరించారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించిన సొమ్ముని, నేరం చేయడానికి ఉపయోగించిన ఉపకరణాల్నీ స్వాధీనం చేసుకున్నారు. అల్‌ బతినా గవర్నరేట్‌ చీఫ్‌ ఆఫ్‌ పోలీస్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్లా అల్‌ ఘైలాని, భారతీయ వలసదారుల్ని సన్మానించారు. రెసిడెంట్స్‌ అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com