విద్యుదాఘాతం: 8 ఏళ్ళ చిన్నారి మృతి
- September 10, 2018
మస్కట్: ఎనిమిదేళ్ళ బాలిక, విలాయత్ ఆఫ్ ఇబ్రాలో విద్యుత్ షాక్‌కి గురై ప్రాణాలు కోల్పోయింది. రాయల్ ఒమన్ పోలీస్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించడం జరిగింది. బాధితురాలి ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిన్నారి, కరెంట్ వైర్‌ని టచ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఎమర్జన్సీ సర్వీసెస్, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అయితే, విద్యుత్ ఉపకరణాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, పిల్లలు కరెంట్ వైర్లకు దూరంగా వుండేలా చూడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







