దొంగతనాన్ని అడ్డుకున్న భారతీయులకి సన్మానం
- September 10, 2018
మస్కట్: ముగ్గురు భారతీయ వలసదారులకు రాయల్ ఒమన్ పోలీస్ సన్మానం చేసింది. అల్ బతినాలో ఓ దొంగతనాన్ని అరికట్టడంలో ఈ ముగ్గురూ చూపిన చొరవకు ఈ గౌరవం దక్కింది. మాల్లో దొంగతనానికి పల్పడిన నిందితుల్ని పట్టుకునే క్రమంలో వలసదారులు పోలీసులకు సహాయ సహకారాలు అందించారు. నిందితులు గ్లాస్ డోర్ నుంచి కమర్షియల్ సెంటర్లోకి అడుగు పెట్టినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - అల్ సువైక్ పోలీస్ స్టేషన్ వెల్లడించింది. వారిని అరెస్ట్ చేసేందుకు వలసదారులు సహకరించారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించిన సొమ్ముని, నేరం చేయడానికి ఉపయోగించిన ఉపకరణాల్నీ స్వాధీనం చేసుకున్నారు. అల్ బతినా గవర్నరేట్ చీఫ్ ఆఫ్ పోలీస్ బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ ఘైలాని, భారతీయ వలసదారుల్ని సన్మానించారు. రెసిడెంట్స్ అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







