విద్యుదాఘాతం: 8 ఏళ్ళ చిన్నారి మృతి

- September 10, 2018 , by Maagulf
విద్యుదాఘాతం: 8 ఏళ్ళ చిన్నారి మృతి

మస్కట్‌: ఎనిమిదేళ్ళ బాలిక, విలాయత్‌ ఆఫ్‌ ఇబ్రాలో విద్యుత్‌ షాక్‌కి గురై ప్రాణాలు కోల్పోయింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ ఘటనను ధృవీకరించడం జరిగింది. బాధితురాలి ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిన్నారి, కరెంట్‌ వైర్‌ని టచ్‌ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఎమర్జన్సీ సర్వీసెస్‌, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అయితే, విద్యుత్‌ ఉపకరణాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, పిల్లలు కరెంట్‌ వైర్లకు దూరంగా వుండేలా చూడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com