కౌశల్ కు ఉచ్చు బిగించనున్న బిన్ బాస్...కౌశల్ ఆర్మీ ఏంచేస్తుందో మరి!

- September 12, 2018 , by Maagulf
కౌశల్ కు  ఉచ్చు బిగించనున్న బిన్ బాస్...కౌశల్ ఆర్మీ ఏంచేస్తుందో మరి!

ప్రస్తుతం బిగ్‌బాస్ కంటెస్టెంట్ కౌశల్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీక్ బై వీక్ అతని ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే అతడిని హౌస్ నుంచి బయటకు పంపేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయంటూ వార్తలు వినవస్తున్నాయి. చివరి వారంలో కౌశల్‌తో ఇంట్రెస్టింగ్ గేమ్‌ని ఆడించబోతోందట బిగ్‌బాస్. దాని పేరు 'రూలర్ గేమ్'. ఈ గేమ్‌లో హౌస్‌ని బిగ్‌బాస్ సిటీగా మార్చి హౌస్‌మేట్స్‌ని ప్రజలుగా.. కౌశల్‌ని కింగ్‌గా ప్రకటించనుందట. హౌస్‌మేట్స్ అంతా కింగ్ చెప్పినదాన్ని తూ.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కాదని ఎదురు తిరిగితే కఠినమైన శిక్షలను కింగ్ విధించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ద్వారా కౌశల్‌ని ఎలిమినేట్ చేసేందుకు లేదంటే అతని క్రేజ్‌ను తగ్గించేందుకు యత్నిస్తోందట బిగ్‌బాస్ టీం.

ఈ గేమ్‌ను హిందీలో సీజన్ 8లో విపరీతమైన క్రేజ్ ఉన్న గౌతమ్ గులాటీతో ఆడించారు. ఈ టాస్క్ కారణంగా హౌస్‌మేట్స్ అంతా అతనికి యాంటీ అయ్యారు. మిగిలిన హౌస్‌మేట్స్‌పై బయట సింపతి బాగా వర్కవుట్ అయింది. ఫినాలేలో గౌతమ్ విన్నర్ అయినా ఓట్లు మాత్రం భారీగా స్ప్లిట్ అయ్యాయి. తమిళ్‌లో కూడా ఐశ్వర్యా దత్తతో ఆడించారు. దీంతో ఆమెకు బయట బాగా వ్యతిరేకత వచ్చింది. మిగిలిన హౌస్‌మేట్స్‌పై సింపతి వర్కవుట్ అయింది. దీనినే మరాఠీ బిగ్‌బాస్‌లో కూడా ఆడించారు. ఇక్కడ కూడా సేమ్ జరిగింది.

కింగ్‌ని బిగ్‌బాస్ గైడ్ చేస్తూ ఉంటారు. హౌస్‌మేట్స్‌తో చేయించుకోవాల్సిన పనులు.. వారు ఎదురు తిరిగితే విధించాల్సిన శిక్షలు మొదలైన వాటన్నింటినీ బిగ్‌బాస్ గైడ్ చేస్తారు. చేయించే పనులు… విధించే శిక్షల కారణంగా చూస్తున్న ప్రేక్షకుల్లో హౌస్‌మేట్స్‌పై సింపతి వర్కవుట్ అయి… కింగ్‌పై ద్వేషం కలగక మానదు. కాబట్టి కౌశల్‌ని ఈ టాస్క్‌లో భాగంగా కింగ్‌ని చేసి ఎలిమినేట్ చేయాలనో లేదంటే అతని క్రేజ్‌ను భారీగా తగ్గించేయాలనో బిగ్‌బాస్ టీం యోచన చేస్తున్నారని తెలుస్తోంది. మరి దీనిపై కౌశల్ ఆర్మీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com