మాల్ ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయిన నాలుగేళ్ళ చిన్నారి
- September 12, 2018దుబాయ్:షాపింగ్ మాల్ ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయిన నాలుగేళ్ళ చిన్నారిని దుబాయ్ పోలీసులు రక్షించారు. స్నీకర్ ధరించిన చిన్నారి ప్రమాదవశాత్తూ స్టెయిర్కేస్లో ఇరుక్కుపోగా, వెంటనే ఎస్కలేటర్ ఆగిపోయింది. దుబాయ్ పోలీస్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బిషు మాట్లాడుతూ, చాకచక్యంగా చిన్నారి ధరించిన స్నీకర్ని కట్ చేసి, చిన్నారి కాలికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆమెను రక్షించినట్లు తెలిపారు. అన్ని ఎస్కలేటర్లు ఆటోమేటిక్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి వుంటాయనీ, అయినాసరే అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఎమర్జన్సీ బటన్ని ప్రెస్ చేసి ఎస్కలేటర్‌ని ఆపివేయవచ్చునని ఆయన చెప్పారు. పిల్లల్ని ఎస్కలేటర్‌పై తీసుకెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అబ్దుల్లా బిషు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు