ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చిన ఒమనీ మహిళ
- September 13, 2018
మస్కట్: ఓ ఒమనీ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. రాయల్ హాస్పిటల్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే పుట్టినవారిలో ఓ చిన్నారి మృతి చెందడం జరిగింది. గత నెలలో ఈద్ సెలవు రోజున ఐదుగురు చిన్నారులు జన్మించారు. వీరిలో నలుగురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శస్త్ర చికిత్స (సిజేరియన్) ద్వారా ఐదుగురు పిల్లల్ని ఆమె గర్భం నుంచి బయటకు తీశారు. అయితే వెంటనే ఓ చిన్నారి మృతి చెందిందని రాయల్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. కిలో నుంచి 1.2 కిలోగ్రాముల బరువు మాత్రమే చిన్నారులు వున్నారనీ, నెల రోజులపాటు ఇన్‌క్యుబేటర్‌లో వుంచిన తర్వాత 1.5 కిలోల బరువుకి చేరుకున్నారని వైద్యులు వెల్లడించారు. వీరంతా ప్రి మెచ్యూర్ బేబీస్ అని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







