గ్రూప్ వెడ్డింగ్ త్వరలో
- September 13, 2018
మస్కట్: పెళ్ళి ఖర్చుల్ని భరించలేని యువతీ యువకుల కోసం అల్ సీబ్‌లో గ్రూఫ్ వెడ్డింగ్‌ని నిర్వహించబోతున్నారు. నవంబర్ 23న ఈ వివాహాలు జరుగుతాయి. సోషల్ డెవలప్మెంట్ కమిటీ - విలాయత్ ఆఫ్ సీబ్ వీటిని నిర్వహించనుంది. 20,000 నుంచి 25,000 ఒమన్ రియాల్స్ ఇందుకోసం ఖర్చు కానుంది. షురా కౌన్సిల్లో అల్ సీబ్ ప్రతినిథి హిలాల్ అల్ సర్మి ఆర్గనైజింగ్ కమిటీ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం పెళ్ళికొడుకు ఒమనీ సిటిజన్ అయి వుండాలి. విలాయత్ ఆఫ్ సీబ్కి తొలి ప్రయారిటీ ఇస్తారు. గ్రూమ్‌కి మరో భార్య వుండకూడదు. గ్యారంటీ కింద 200 ఒమన్ రియాల్స్ డిపాజిట్ చేయాల్సి వుంటుంది. గ్రూమ్స్ 50 మంది స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌ని ఈ కార్యక్రమం కోసం తీసుకురావాల్సి వుంటుంది. సెప్టెంబర్ 9న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటికే 8 అప్లికేషన్లు వచ్చాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







