యూ టర్న్:రివ్యూ

- September 13, 2018 , by Maagulf
యూ టర్న్:రివ్యూ

స్టార్ కాస్ట్: సమంత , ఆది , భూమిక తదితరులు..

దర్శకత్వం: పవన్ కుమార్

నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు

సహ నిర్మాత: బొక్కా సత్యనారాయణ 

మ్యూజిక్: పూర్ణచంద్ర తేజస్వి

విడుదల తేది: సెప్టెంబర్ 13, 2018 


వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న అక్కినేని కోడలు సమంత..తాజాగా యూ టర్న్ అంటూ స్పస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో ఈరోజు తెలుగు , తమిళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ లో సూపర్ హిట్ అయినా ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ భాషల్లో పవన్ కుమార్ తెరకెక్కించడం జరిగింది.

సమంత జర్నలిస్ట్‌గా కనిపించనుండగా.. ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ అఫీసర్‌గా నటించారు. భూమిక, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈఏడాది లో రంగస్థలం , అభిమన్యుడు , మహానటి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న సమంత..యూ టర్న్ తో హిట్ అందుకుందా..లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

రచన (సమంత) రిపోర్టర్ గా పనిచేస్తుంటుంది..ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరుగుతున్న ఆక్సిడెంట్ల ఫై ఓ కథ రాయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకుంటున్న వ్యక్తుల వాహనాల నెంబర్ ప్లేటలను తీసుకుంటుంది. ఆ నెంబర్ ప్లేటల ఆధారంగా వారిని ఇంటర్వ్యూ చేయాలనీ అంటుకుంటుంది. ఈ క్రమంలో ఓ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఓ వ్యక్తి ని ఇంటర్వ్యూ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లగా ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు.

దీంతో రచనే ఆ వ్యక్తిని హత్య చేసిందని, పోలీసులు ఆమెను అనుమానించి ఎంక్వేరి చేస్తారు. ఆ ఎంక్వేరిలో ఎస్ఐ నాయక్ (ఆది పినిశెట్టి) కు రచన ఏ తప్పు చెయ్యలేదని తెలిసిపోతుంది. రచన ఎవరెవరి నెంబర్ ప్లేట్స్ తీసుకుంటుందో వారంతా చనిపోయి ఉంటారు. కేవలం యూ టర్న్ తీసుకుంటున్న వ్యక్తులే ఎందుకు చనిపోతున్నారు..? కావాలనే వారు చనిపోతున్నారా..లేక ఎవరైనా చంపుతున్నారా..? రచన ఈ కేసు నుండి ఎలా బయటపడుతుందో..? ఈ కథ కు మాయ (భూమిక) సంబంధం ఏంటి..? చివరకు యూ టర్న్ మిస్టరీ ఎలా వీడుతుందనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్:

* కథ - కథనం

* సమంత యాక్టింగ్

* సస్పెన్స్ గా సాగడం

మైనస్:

* కామెడీ లేకపోవడం

* కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా సాగడం

నటీనటుల పెర్పామెన్స్ :

* ఏడాది సమంత జోరు ఏ విధంగా ఉందొ తెలియంది కాదు.. రంగస్థలం, మహానటి, అబిమాన్యుడు ఎలా చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టరే.. ఇలా హిట్ల మీద హిట్లు అందుకుంటున్న సామ్..యూ టర్న్ ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీసుకుంది. ఈ మూవీ లో రిపోర్టర్ రచన గా ఎంతగానో ఆకట్టుకుంది..గ్లామర్ పరంగానే కాకుండా లేడి ఓరియంటెడ్ గా కూడా సత్తా చాటుతానని నిరూపించింది. ఈమె నటన కు థియేటర్స్ లలో అభిమానులు , ప్రేక్షకులు ఎంజాయ్ చేసారు.

* పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి అదరగొట్టాడు.

* భూమిక పాత్ర కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది.

* రాహుల్ తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు. ఇక మిగతా వారంత వారి వారి పాత్రల్లో నటించారు.

సాంకేతిక విభాగం:

* పూర్ణచంద్ర తేజస్వి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది..కథ కు తగిన విధంగా తన మ్యూజిక్ అందించి సక్సెస్ అయ్యాడు.

* నికేత్ బొమ్మి సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది..

* శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ పవన్ కుమార్ విషయానికి వస్తే ఆల్రెడీ ఈ చిత్రాన్ని కన్నడలో తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఒరిజనల్ వర్షన్ ను తెలుగు , తమిళ్ లో రీమేక్ చేసాడు. ఆసక్తికరమైన కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెలుగు ఆడియన్స్ కు కొత్తగా చూపించి ఆకట్టుకున్నాడు. సస్పెన్స్ మరియు థ్రిల్ నింపిన సన్నివేశాలతో సినిమాను నడిపాడు. ఇంటర్వెల్ వరకు కథలో ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా నడిపించి అదరగొట్టాడు.కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తగ్గినట్లు అనిపించాయి. అలాగే సినిమా ఎక్కువగా సీరియస్ గా సాగడం వల్ల మాస్ ప్రేక్షకులు కాస్త బోర్ గా ఫీల్ ఆయె అవకాశం ఉంది.

చివరిగా:

విభిన్న కథలను ఇష్టపడే వారికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది..వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న సమంత మరోసారి ఈ మూవీ తో ఆకట్టుకుంది. స్పస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుంది.

--మాగల్ఫ్ రేటింగ్ : 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com