మస్కట్ ఫెస్టివల్ 2019 తేదీల ఖరారు
- September 14, 2018
29 రోజుల మస్కట్ ఫెస్టివల్‌కి సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 9 వరకు మస్కట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫెస్టివల్‌ని విజిట్ చేయాలనుకునే సందర్శకులకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఫెస్టివల్ అందుబాటులో వుంటుంది. వీకెండ్స్‌లో మిడ్నైట్ వరకూ ఫెస్టివల్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే కంపెనీలకు మస్కట్ మునిసిపాలిటీ ఆహ్వానం పలికింది. రువీలోని హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీలు అక్టోబర్ 1 లోపు స్టాల్స్‌కి సంబంధించి వివరాలు అందించాల్సి వుంటుంది. ఈవెంట్స్ చేయాలనుకునేవారు ఫెస్టివల్లో ఏ ప్రాంతంలో వాటిని నిర్వహిస్తారో తెలియజేయడంతోపాటు, కొంత మొత్తాన్ని మునిసిపాలిటీకి చెల్లించాల్సి వుంటుంది. ఈవెంట్‌కి సంబంధించిన మొత్తం ఆ సంస్థకు దక్కుతుంది. ఎంట్రీ టిక్కెట్లో 10 శాతం మస్కట్ మునిసిపాలిటీకి దక్కుతుంది. ఫెస్టివల్ జరిగినన్ని రోజులూ మస్కట్ మునిసిపాలిటీ లాజిస్టికల్ సపోర్ట్‌ని, ప్రచారాన్ని కల్పిస్తుంది. అప్లికెంట్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌కి సంబంధించిన ఆధారాల్ని సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







