పోలీస్ అధికారితో తలపడనున్న బహ్రెయినీ అథ్లెట్
- September 14, 2018మనామా: బహ్రెయినీ అథ్లెట్ హమ్జా కూహెజి, ఫిలిప్పైన్స్ వెటరన్ పోలీస్ అధికారి క్రిసాంటో పిటపిటంగ్‌తో తలపడనున్నారు. సెప్టెంబర్ 21న యూఏఈలోని అబుదాబీలో ముబాదలా ఎరీనాలో జరుగనున్న రబేవ్ 16లో ఈ పోటీ జరుగుతుంది. బహ్రెయినీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్, కంబాట్ సిట్యుయేషన్స్‌లో ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ అయిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్‌తో పోటీ పడుతుండడం ఇదే తొలిసారి. బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్‌తో సైన్ అయిన తొలి ఫిలిప్పీన్స్ ఫైటర్‌గా పిటిపిటంగ్ రికార్డులకెక్కారు. చిన్న గాయం కారణంగా కాస్త ఆలస్యంగా ఈ పోటీల్లోకి ఆయన ప్రవేశిస్తున్నారు. బహ్రెయినీ ఫైటర్స్‌తో అతనికిది చాలా కష్టమైన ఫైట్ అని అంచనా వేస్తున్నారు. హమ్జా కూహెజి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత ప్రావీణ్యం వున్న వ్యక్తి. ఇండోనేసియాలో బ్రేవ్ 12 తర్వాత అస్సలేమాత్రం రెస్ట్ తీసుకోలేదనీ, ప్రతిరోజూ ట్రైనింగ్ కొనసాగిస్తూ వచ్చానని, బహ్రెయిన్ కింగ్‌డమ్ కోసం తాను పోరాడుతున్నానని, ఇది తనకు చాలా ఆనందంగా వుందని విజయం సాధించి కింగ్‌డమ్‌కి ఆ విజయాన్ని బహుమతిగా ఇస్తానని కూహెజి చెప్పారు.
తాజా వార్తలు
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా