రిటైర్‌మెంట్ తర్వాత కూడా యూఏఈలో.. తెలుసుకోండిలా!
- September 16, 2018
రిటైర్‌మెంట్ తర్వాత ఎక్కువ కాలం యూఏఈలో వుండడానికి వలసదారులకు వీలు కల్పిస్తున్నట్లు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. అయితే ఎంతకాలం ఈ రెసిడెన్సీ పీరియడ్ వుంటుందన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా షేక్ మొహమ్మద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రియల్ విభాగానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఫీజుని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామనీ, ఒక రోజు కోర్ట్ సిస్టమ్‌ని ఫెడరల్ లెవల్‌కి సంబంధించి అప్రూవ్ చేశామని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. పబ్లిక్, ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించి ఫెడరల్ స్టాండర్డ్స్‌ని కూడా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. సమ్మర్ హాలిడే తర్వాత తొలి క్యాబినెట్ జరిగిందనీ, నేషనల్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతూనే వుంటాయని షేక్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..







