తప్పిపోయిన మహిళ క్షేమం
- September 17, 2018_1537185737.jpg)
నార్త్ బతినాలోని విలాయత్ ఆఫ్ లివా నుంచి అదృశ్యమయిన మహిళను సలాలాలో గుర్తించారు. హలిమా హస్సాన్ అల్ షామ్సి, నాలుగు రోజుల క్రితం అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఆమెను సలాలో కనుగొన్నారు. హలిమా హస్సాన్ క్షేమంగా, ఆరోగ్యంగానే వున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్, ఆన్‌లైన్‌లో విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో పేర్కొనడం జరిగింది. ఆమెను, ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం హలీమా ఇంట్లోంచి వెళ్ళిపోయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!