దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
- September 17, 2018
దుబాయ్‌లోని షేక్ రషీద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి గాయలయ్యాయి. వాహనం టైరు పేలి, బ్యారియర్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందినవారిలో ఓ మహిళ, ఓ పురుషుడు వున్నారు. గాయపడ్డవారిలో ఐదుగురు మహిళ కాగా, ఒకరు పురుషుడు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.32 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడ్డవారికి రషీద్ హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందుతోందని అల్ మురాకాబాద్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి అహ్మద్ అబ్దుల్లా ఘానిమ్ చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించడంతోపాటు, రెగ్యులర్‌గా తమ వాహనాన్ని చెక్ చేస్తుండాలనీ, టైర్ల విషయంలో అప్రమత్తంగా వుండాలని బ్రిగేడియర్ ఘానిమ్ సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







