వాషింగ్ మెషీన్ పేలి 9 మందికి గాయాలు
- September 17, 2018
అజ్మన్‌లోని ఓ ఫ్లాట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా ఆ ఫ్లాట్‌లోని సామాగ్రి ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారంతా అరబ్ జాతీయులే. పొగ పీల్చడంతో వీరికి అస్వస్థత కలిగింది. వారికి ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు సివిల్ డిఫెన్స్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆపరేషన్ రూమ్‌కి సమాచారం అందడంతో, వెంటనే సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్స్ మరియు సివిల్ డిఫెన్స్ చేరుకున్నాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరగ్గా, వెంటనే స్పందించిన సివిల్ డిఫెన్స్, చాకచక్యంగా మంటల్ని అదుపు చేశాయి. ఈ అగ్ని ప్రమాదానికి వాషింగ్ మెషీన్ కారణంగా గుర్తించారు. సెంట్రల్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ రయీద్ ఒబైద్ అల్ జాబి మాట్లాడుతూ, హౌస్ హోల్డ్స్ మరియు రెసిడెన్షియల్ యూనిట్స్‌లో భద్రత పరంగా నిర్లక్ష్యం తగదని చెప్పారు. గృహోపకరణాల వాడకంలో అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







