ధావన్ ఇరగదీసిండు
- September 18, 2018
ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్-ఏలో భారత్ -హాంకాంగ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ జోరు చూపించాడు. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగగా... నిర్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సెంచరీ, అంబటి రాయుడు అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 127 పరుగులతో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు ధావన్... తొలి పవర్ ప్లే నుంచే రోహిత్ శర్మ, ధవన్ ధాటిగా ఆడారు. మొదటి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన రాయుడు 70 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 60తో చెలరేగి ధావన్‌కు మంచి సహకారం అందించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఫోర్లు, సిక్స్‌లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక రాయుగు ఔట్ కావడంతో దినేష్ కార్తీక్ (33)తో కలసి ధావన్ బ్యాటింగ్ కొనసాగించాడు... 36వ ఓవర్ చివరి బంతికి సింగిల్‌తో వన్డే కెరీర్‌లో 14వ సెంచరీ నమోదు చేసిన ధావన్... ఆ తర్వాత ఫోర్, సిక్సర్‌తో మరింత వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు... కానీ, ఆఫ్ స్పిన్నర్ కించిత్ షా బౌలింగ్‌లో తన్వీర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
పసికూనలపై విజయం నల్లేరుపై నడకేనని భావించినా... హాంకాంగ్ కుర్రాళ్లు హడలెత్తించారు. టీమిండియాపై మంచి పోరాటపటిమను చూపించారు. ఉత్కంఠబరితంగా సాగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా ఊపిరిపీల్చుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







