74 ఏళ్ళ భార్యను గెంటేసిన భర్త
- September 18, 2018
మనామా: ఓ బహ్రెయినీ వ్యక్తి, 74 ఏళ్ళ తన భార్యను వదిలేశాడు. 30 ఏళ్ళ వయసున్న ఓ ఆసియా మహిళను తాజాగా పెళ్ళి చేసుకున్న ఆ వ్యక్తి (వయసు ఏడు పదుల వున్న వ్యక్తి), తన మొదటి భార్యను ఇంట్లోంచి గెంటేశాడు. దాంతో బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం, బాధిత మహిళకు అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. ఆమెకు, తన భర్త ఇంట్లో వుండే హక్కు వుందనీ, ఆ ఇంట్లో చాలా సామాన్లు ఆమె తన కష్టంతో కొనుగోలు చేసిందని బాధిత మహిళ తరఫు న్యాయవాది చెప్పారు. వయసు రీత్యా అయినా బాధిత మహిళ పట్ల ఆమె భర్త, సానుకూలంగా వ్యవహరించి వుండాల్సిందని న్యాయవాది అల్ తమిమి అభిప్రాయపడ్డారు. ఇంట్లోంచి ఆమెను గెంటేయడం అక్రమం, అన్యాయం, నేరమని అల్ తమిమి చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి