అమెరికాలో ఆ విషయంలో మనమే టాప్
- September 19, 2018
అమెరికా పౌరసత్వం.. చాలామందికి అదోక కల. అందుకు తగ్గట్టుగానే.. ఆ దేశ పౌరసత్వం పొందడం కూడా చాలా కష్టం. ఎన్నో దేశాలకు చెందిన వ్యక్తులు యూఎస్ పౌరసత్వం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ.. అమెరికాలో భారతీయుల పరిస్థితి మరోలా ఉంది. గతేడాది అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య పెరిగింది. 2016తో పోల్చితే 2017లో 10 శాతం మేర వృద్ధి కినిపించింది. ఏకంగా 50 వేల మంది ఆ దేశ పౌరసత్వం పొందారు. ఇదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందిన మిగతా దేశస్థుల సంఖ్య తగ్గింది. 2016తో పోల్చితే 2017లో 6 శాతం పడిపోయింది. 2016-17 మధ్య అమెరికా పౌరసత్వం పొందినవారిలో మెక్సికన్లు మొదటి స్థానంలో ఉండగా.. మనోళ్లు రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 7 లక్షల మందికి అమెరికా పౌరసత్వం లభించగా.. అందులో భారతీయులు 7 శాతం మంది ఉన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







