బహ్రెయిన్ అమర వీరులకు నివాళీ అర్పించిన సమాచార , పార్లమెంటరీ శాఖ మంత్రి

- December 18, 2015 , by Maagulf
బహ్రెయిన్ అమర వీరులకు నివాళీ అర్పించిన సమాచార , పార్లమెంటరీ శాఖ మంత్రి

బహ్రెయిన్చార్త్రాత్మక గుర్తింపును , జాతీయ ఇక్యతను  కాపాడటంలో టం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగం ఎన్నడు మరువలేనిదని  బహేరిన్ సమాచార, పార్లమెంటరీ శాఖ మంత్రి ఇసా బిన్ అబ్దుల్ రెహమాన్ కృతజ్ఞత ప్రకటించారు. గురువారం  ఆయన విధి నిర్వహణలో అమరులైన  భద్రతా ,సైనిక సిబ్బందికి వందనం చేసి ఘన నివాళీ అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,గౌరవనీయ  బహేరిన్ రాజు  హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా డిసెంబర్ 17 వ  తేదిను అమరవీరుల త్యాగాలను  గుర్తు  చేసుకోవడం కోసం అంకితమిస్తున్నట్లు ఆదెశించెరని అన్నారు. భద్రతా, సైనిక సిబ్బంది తమ అంకిత భావంతో బహేరిన్ పౌరుల ధన ప్రాణాలను కాపాడటంలో చేస్తున్న కృషి ఎంతో, అభినందనీయమని చెబ్తూ , అందుకు ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు. బహేరిన్ సైనికుల త్యాగాలు  దేశం ఎన్నడూ మరవదని పేర్కొంటూ , రాబోయే తరాలకు ఈ సాంప్రదాయం అనుసరణీయం, గర్వకారణం
  కాగలదని  అన్నారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com