200 దిర్హామ్‌ల కంటే తక్కువకే ఇండియాకి ప్రయాణం
- September 19, 2018
ఇండియాకి వెళ్ళేందుకోసం అతి తక్కువ ధరకే విమాన ఛార్జీలు లభ్యమవుతాయని ఎదురుచూసేవారికి శుభవార్త. యూఏఈ ఎయిర్‌లైన్స్ ఒకటి, ఢిల్లీ, జైపూర్, కోచి, కోజికోడ్, ముంబై, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు 169 దిర్హామ్‌లకే ప్రయాణించేందుకు వీలు కలుగుతోంది. బహ్రెయిన్, కరాచీ, కువైట్, మస్కట్, సలాలా వంటి ప్రాంతాలకు 199 దిర్హామ్‌లకే టిక్కెట్లు లభ్యమవుతాయి. ఎతిహాద్ ఎయిర్వేస్, హ్యాండ్ బ్యాగేజ్ ఓన్లీ డీల్ ఫేర్ ఆఫర్‌ని అబుదాబీ, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఒమన్, అజర్బైజాన్, జోర్డాన్, లెబనాన్, ఈజిప్ట్ తదితర ప్రాంతాలకు విమాన ప్రయాణాన్ని ఆఫర్ చేస్తోంది. 29 సెప్టెంబర్‌లోగా ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకుని, 4 సెప్టెంబర్ నుంచి 31 మార్చి 2019 వరకు ప్రయాణించొచ్చు. అబుదాబీ నుంచి బహ్రెయిన్ ప్రయాణానికి 813 దిర్హామ్‌లకు, కువైట్‌కి 973 దిర్హామ్‌లకు ప్రయాణించొచ్చు. వీక్లీ సేవర్స్ పేరుతో ఎకానమీ క్లాస్ ప్రయాణీకులకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌ని ఐదు రోజుల పాటు అందుబాటులో వుంచారు. ఈ వీక్ ఆఫర్ కింద బీరట్, కరాచి, బ్యాంకాక్, రియో డిజనీరో, సాఓ పాలో మరియు పలు ప్రాంతాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







