గణేష్ నిమజ్జన వేడుకలు @ లండన్
- September 20, 2018
లండన్ : లండన్ నగరంలోని హౌంస్లో ప్రాంతంలో హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆరవ సారి ఘనంగా గణేష్ వేడుకలు జరిగాయి. యూత్ సభ్యులతో పాటు అక్కడున్న తెలంగాణవాసులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. లండన్ వీధుల్లో గణేష్ విగ్రహ ఊరేగింపు శోభాయమానంగా సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు. 'గణపతి బప్పా మోరియా', 'జై బోలో గణేష్ మహారాజ్ కి జై' అంటూ లండన్ వీధులు దద్దరిల్లాయి. బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డుని వేలం పాటలో ధనంజయ్ 802 పౌండ్స్ కి దక్కించుకోవడం జరిగింది. అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు. థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు. ఎన్నారై టిఆర్ఎస్ మరియు సంస్థ అధ్యక్షుడు అశోక్ దూసరి, ఎన్నారై టిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు మరియు తెలంగాణా అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్( టాక్ ) వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు టాక్ అధ్యక్షురాలు శ్రీమతి పవిత్ర రెడ్డి కంది ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి, విక్రమ్ రెడ్డి రేకుల, సత్య చిలుముల, సత్యపాల్ పింగిళి, రామ రావు, శ్రీధర్ మెరుగు, శ్రీకాంత్ రెడ్డి, వంశీ రేక్నోర్, వెంకీ, రాజేష్ వాకా, నగేష్, రాకేష్, రవి కిరణ్ తో పాటు ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకులు చంద్రశేఖర్ సిక్కా, రవి ప్రదీప్ పులుసు, రవి రత్తినేని, శ్రీకాంత్ జెల్లా, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, ప్రశాంత్, సురేష్ గోపతి, గణేష్ పాస్తం మరియు టాక్ ముఖ్య నాయకులు స్వాతి బుడగం, రాకేష్ పటేల్, వంశీ పొన్నం, శుష్మున రెడ్డి, అపర్ణ, శైలజ, శ్రావ్య, స్వాతి, విజిత రెడ్డి, శ్రీ కాపు, స్థానిక ప్రవాసులు శ్రీకాంత్ జింకల, రమేష్, మధు గుల్యాగారి, సందీప్, నగేష్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ధర్మ ముట్ట, చెర్రీ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!