మరీ సన్నగా ఉన్నవారు హ్యాండ్‌సమ్‌గా కనిపించాలంటే...
- September 20, 2018మగవారు కానీ, ఆడవారు కానీ, పిల్లలు కానీ వారివారి ఎత్తుకు, వయసుకు తగిన బరువు కలిగి ఉండటమే అందం, ఆరోగ్యము కూడా. అలాకాక ఎత్తుకు తగినంత బరువు కంటే మరీ తక్కువ ఉండటం అంద వికారానికి, అనారోగ్యానికి దారి తీస్తుంది. దీనికి మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
1. శరీర బరువుకు అవసరమయ్యే పప్పులు, గ్రుడ్డులు, చేపలు, మాంసం వారానికి నాలుగు లేక అయిదుసార్లు వాడాలి.
2. శాఖాహారులు అన్ని రకాల పప్పు దినుసులు తీసుకోవాలి. ప్రతి రోజు డ్రైప్రూట్స్ తీసుకోవాలి. తినే ఆహారం మోతాదు పెంచాలి.
3. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు. కనుక కొంచెం కొంచెం ఆహారం మోతాదును పెంచడం మంచిది.
4. మూడుపూట్ల భోజనం చేస్తూ మధ్యలో చిరుతిండ్లు తినడం మంచిది. అంతేకాకుండా కాయగూరలు, పండ్లు కూడా సమృద్ధిగా తీసుకోవాలి. దుంపకూరలు అంటే... చేమ, కంద, బంగాళదుంపలు మొదలైనవి ఎక్కువగా తినాలి.
5. పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!