వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది
- September 21, 2018
మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చేందుకు టెస్ట్ కూడా చేస్తోంది. నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్లైన్ ఇమేజ్ స్టయిల్‌ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సాప్‌కు మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్లో ఇమేజ్ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకముందు కూడా వాట్సాప్ నోటిఫికేషన్లో ఇన్లైన్ ఇమేజస్‌ను వాడింది. కానీ తాజాగా కొత్త మెసేజింగ్‌స్టయిల్ నోటిఫికేషన్ ఫార్మాట్లో దీన్ని తీసుకొస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా ఛానల్లో టెస్ట్ చేశారు. అయితే ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ 9 పై డివైజ్‌లకు మాత్రమే పనిచేయనుంది.
నోటిఫికేషన్ల కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్ జీఐఎఫ్‌లకు, వీడియోలకు పనిచేయదు. కేవలం చిన్న ఐకాన్ మాత్రమే ఇమేజ్ రూపంలో వస్తుంది. కేవలం ఆండ్రాయిడ్ పైలకు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. కాగా, పాత ఐఫోన్లన్నీ పాత ఆండ్రాయిడ్ వెర్షన్లతోనే రన్ అవుతున్నాయి. దీంతో వాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం లేదు. ఓరియో వెర్షన్ల బీటాలో కూడా ఈ ఫీచర్ కనిపించడం లేదు. కేవలం ఆండ్రాయిడ్ 9 పై వారికి మాత్రమే ఈ ఫీచర్. అంతేకాక ఆండ్రాయిడ్ బీటాలో కొత్త స్టికర్ ప్యాక్‌ను బిస్కెట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. కానీ ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులో లేదు. డిఫాల్ట్‌గా డిసేబుల్ అయింది. మెసెంజర్లో బిస్కెట్ పాపులర్ స్టిక్కర్ ప్యాక్. దీన్నే వాట్సాప్ కూడా తన యాప్‌లోకి తీసుకురావాలనుకుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!