విడుదలకు సిరెడీ అవుతున్న'సండకోళి2' సినిమా
- September 21, 2018
చెన్నై: విశాల్ కథానాయకుడిగా నటించిన 'సండకోళి' (పందెం కోడి) తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ శరవేగంగా తెరకెక్కుతోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. తన సొంత బ్యానరైన విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బ్యానరుపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇది ఆయనకు 25వ చిత్రం కావడం విశేషం. ఇటీవలే 'ఇరుంబుతిరై' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు విశాల్. ఈ సారి 'సండకోళి 2'తో మరో విజయాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మదురై నేపథ్యంలో సాగే ఈ మాస్ కమర్షియల్ చిత్రంలో రాజ్‌కిరణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా పాటలను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఆయుధ పూజ సందర్భంగా అక్టోబరు 18న చిత్రం విడుదలకానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







