అరబ్ ఫైనాన్షియల్ సెంటర్స్: మనామాకి 6వ ర్యాంక్
- September 21, 2018
మనామా:గ్లోబల్ ఫైనాన్స్ సెంటర్స్ ఇండెక్స్ (జిఎఫ్సిఐ ఇండెక్స్) ర్యాంకింగ్స్‌లో మనామా ప్రపంచ స్థాయిలో 59వ ర్యాంక్ దక్కించుకోగా, అరబ్ ప్రపంచంలో 6వ ర్యాంక్‌ని సొంతం చేసుకుంది. వరల్డ్ బ్యాంక్, ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్, వంటి ప్రముఖ సంస్థలు ఈ అస్సెస్మెంట్లో పాల్గొన్నాయి. బిజినెస్ఎన్విరాన్మెంట్, ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ క్యాపిటల్, పబ్లిక్ ఫ్యాక్టర్స్ వంటి అంశాల్ని ఈ ర్యాంకింగ్స్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్స్‌లో దుబాయ్‌కి అరబ్ వరల్డ్‌లో మొదటి స్థానం దక్కగా, గ్లోబల్ ఇండెక్స్‌లో 15వ స్థానం దక్కింది. అబుదాబీ వరల్డ్ ర్యాంకింగ్ 26 కాగా, అరబ్ వరల్డ్ ర్యాంకింగ్ 2. న్యూయార్క్ సిటీ వరల్డ్ ఇండెక్స్‌లో తొలి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానం లండన్ దక్కించుకుంది. హాంగ్ కాంగ్, సింగపూర్, షాంఘై తదుపరి స్థానాల్లో నిలిచాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







