అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్‌

- September 22, 2018 , by Maagulf
అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్‌

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒకే మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఈ ఘటన సాధించిన టీమిండియా ఆటగాళ్లలో ధావన్ తన పేరును లిఖించుకున్నాడు. శుక్రవారం బాంగ్లాదేశ్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు ధావన్. బంగ్లా ఆటగాళ్లు నజ్ముల్లా హుస్సేన్‌, షకిబుల్‌ హసన్‌, మెహిదీ హాసన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ క్యాచ్‌లను ధావన్‌ అందుకున్నాడు. గతంలో టీమిండియా ఆటగాళ్లు.. సునీల్‌ గావస్కర్‌, అజహరుద్దీన్‌, సచిన్‌ టెండూల్కర్‌ , రాహుల్‌ ద్రవిడ్‌ , మొహమ్మద్‌ కైఫ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ఈ ఘనత సాధించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com