కొలంబో:లంకపై భారత్ ఘన విజయం
- September 22, 2018
కొలంబో: భారత మహిళల జట్టు మరో ఘన విజయం సాధించింది. శ్రీలంక మహిళల జట్టుతో శనివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగెజ్(57: 40 బంతుల్లో) అర్ధశతకంతో రాణించడంతో భారత్ అలవోకగా విజయాన్నందుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రైద్దెంది. 132 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా ఆరంభంలో గొప్ప శుభారంభం లభించేదు. అయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగులు సాధించింది. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి 18.2 ఓవర్లలోనే భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను 131/ 8కే భారత్ కట్టడి చేసింది. లంక బ్యాట్స్వుమెన్లలో శశికళ(35), నీలాక్షి డిసిల్వా(31) మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, హర్మన్‌ప్రీత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!