పొట్ట సర్జరీకి ముందు బిర్యానీ అడిగిన క్యాన్సర్ బాధితుడు
- September 23, 2018
దుబాయ్:క్యాన్సర్ కారణంగా పొట్టలోని కీలకమైన భాగాల్ని తొలగించాల్సి రావడంతో, ఓ వ్యక్తి సర్జరీకి ముందు బిర్యానీ తినాలని వుందని కోరాడు. దాంతో, డాక్టర్లు అతనికి అనుమతినిచ్చారు. భార్య వండిన బిర్యానీని, సోదరుడు తీసుకురాగా, ఆ వ్యక్తి సర్జరీకి ముందు బిర్యానీ తిన్నాడు. క్యాన్సర్‌తో బాధపడ్తున్న గులామ్ అబ్బాస్ ఆఖరి కోరిక ఇది.. సర్జరీకి ముందు. అబ్బాస్‌కి ఇద్దరు చిన్నారులు వున్నారు. అందులో ఒకరు ఏడాదిన్నర బాలుడు కాగా, కూతురికి ఆరేళ్ళు. స్టేజ్ 3 క్యాన్సర్‌తో అబ్బాస్ బాధపడుతున్నారు. రషీద్ హాస్పిటల్ - గ్యాస్ట్రో ఎంటరాలజీ క్లినిక్‌కి వెళ్ళిన అబ్బాస్‌కి క్యాన్సర్ వుందంటూ వైద్యులు నిర్ధారించారు. క్యాన్సర్ ట్యూమర్ దాదాపుగా అబ్బాస్ పొట్ట భాగాన్ని ఆక్రమించేసిందని వైద్య పరీక్షల్లో తేలింది. తొలుత అబ్బాస్‌కి కీమో థెరపీ ఇచ్చారు వైద్యులు. ఆ తర్వాత కాస్త పరిస్థితి మెరుగుపడిందని అబ్బాస్ చెప్పాడు. కిమో థెరపీ కేవలం ట్యూమర్‌ని ష్రింక్ మాత్రమే చేస్తుందనీ, పూర్తిగా నయం కాదని వైద్యులు చెప్పారు. దాంతో, డాక్టర్ల సూచన మేరకు అబ్బాస్, పొట్టలోని చాలా భాగం తొలగించుకునేందుకు సిద్ధమయ్యాడు. సర్జరీ తర్వాత ప్రత్యామ్నాయ మార్గంలో ఆహారాన్ని అందించే అవకాశం వున్నా, సాధారణ ఆహారానికి ఆయన దూరం కాక తప్పదని వైద్యులు చెప్పారు. సర్జరీ తర్వాతి పరిస్థితిని ముందే తెలుసుకున్నాననీ, జరిగే పరిణామాల్ని స్వాగతించక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు అబ్బాస్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







