దడ పుట్టిస్తున్న క్రూడ్‌ ఆయిల్‌

- September 24, 2018 , by Maagulf
దడ పుట్టిస్తున్న క్రూడ్‌ ఆయిల్‌

ఇరాన్‌పై ఆంక్షలు అమలు గడువు దగ్గరపడేకొద్దీ అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు జెట్‌ స్పీడుతో పరుగులు తీస్తున్నాయి. క్రూడ్‌ ధరలు పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేసినా... ధరలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆదివారం అల్జీరియాలో భేటీ అయిన ఒపెక్‌ దేశాల తుది నిర్ణయం ఇంకా వెల్లడి కాలేదు. గతవారం తీవ్ర ఒడుదుడుకులకు లోనైన ముడి చమురు ధరలు ఇవాళ ఉదయం నుంచి భారీగా పెరిగాయి. ఇరాన్‌పై ఆంక్షల వల్ల చమురు సరఫరాలో రోజుకు 15 లక్షల బ్యారెళ్ళ కోత పడుతుంది. మరి దీన్ని భర్తీ చేసేందుకు ఒపెక్‌ తీసుకున్న చర్యలపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది.ఏయే దేశం ఎంత మేరకు ఉత్పత్తి పెంచుతాయనే అశంపై కచ్చిత వివరాలు తెలియడం లేదు. అమెరికాలో ముడి చమురు స్టాక్‌ తగ్గడంతో గతవారం గణనీయంగా పెరిగిన క్రూడ్‌.. వారాంతాన క్షీణించింది. కాని సోమవారం ఉదయం ఒకేసారి రెండు శాతం పెరగడంతో భారత్‌ వంటి చమురు కొనుగోలు దేశాల్లో గుబులు మొదలైంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఇప్పటికే 80 డాలర్లకు చేరగా, నవంబర్‌ నెలకల్లా 90 డాలర్లు, ఏడాది చివరికల్లా 100 డాలర్లకు చేరుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com