5 ఒమన్‌ రియాల్స్‌తో ఇండియన్స్‌కి ఒమన్‌ టూరిస్ట్‌ వీసా

- September 24, 2018 , by Maagulf
5 ఒమన్‌ రియాల్స్‌తో ఇండియన్స్‌కి ఒమన్‌ టూరిస్ట్‌ వీసా

మస్కట్‌: 10 రోజులకుగాను 5 ఒమన్‌ రియాల్స్‌ ఖర్చుతో ఇండియన్స్‌ ఒమన్‌లో పర్యటించేందుకు వీలు కల్పిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం అధికారి ఒకరు చెప్పారు. మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన ఓ రోడ్‌ షోలో మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం అండర్‌ సెక్రెటరీ మైతా సైఫ్‌ అల్‌ మహ్రూెకి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, జపాన్‌ మరియు షెంగాన్‌ దేశాలకు వెళ్ళేందుకు వీసా పొందినవారు ఈ టూరిస్ట్‌ వీసాని ఒమన్‌ కోసం పొందే అవకాశం వుంది. ఒమన్‌ టూరిజంలో ఇండియన్‌ విజిటర్స్‌ పాత్ర ఎక్కువ వుందని తాము భావిస్తున్నట్లు అల్‌ మహ్రైకి వెల్లడించారు. ఒమన్‌ ఇ-వీసాకి ఈ కొత్త టూరిజం వీసా అదనం. ఇ-వీసా 20 ఒమన్‌ రియాల్స్‌ ఖర్చుతో నెల రోజుల చెల్లుబాటుతో లభ్యమవుతోంది. 2014 నుంచి ఇండియన్‌ ఎరైవల్స్‌లో ఒమన్‌ 31 శాతం గ్రోత్‌ని నమోదు చేస్తోంది. 2017లోనే మొత్తం 321,161 మంది ఇండియన్‌ విజిటర్స్‌ని ఒమన్‌ రిసీవ్‌ చేసుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com