విడాకుల కేసులో బాధితురాలికి ఊరట

- September 24, 2018 , by Maagulf
విడాకుల కేసులో బాధితురాలికి ఊరట

బహ్రెయిన్: కష్ట సాధ్యంగా మారిన వైవాహిక జీవితం నుంచి విముక్తి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బహ్రెయినీ మహిళకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. విడాకుల కేసులో ఆమె విజయం సాధించింది. బాధిత మహిళ తరఫు లాయర్‌ మనార్‌ మాట్లాడుతూ, 9 ఏళ్ళ క్రితం ఆమెకు పెళ్ళయ్యిందనీ, అయితే భర్త వేధింపులను భరించలేక ఆమె విడాకులు కోరిందని చెప్పారు. బాధిత మహిళకు పిల్లలు కూడా ఉన్నారు. మూడేళ్ళ క్రితం బాధిత మహిళను ఆమె భర్త ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఓ సారి ఆమెపై భర్త దాడి చేయడంతో, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందింది. ఈ క్రమంలో ఆమె చెవికి సర్జరీ కూడా జరిగినట్లు న్యాయవాది వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com