స్నేహితుడ్ని హతమార్చిన స్నేహితులు

- September 25, 2018 , by Maagulf
స్నేహితుడ్ని హతమార్చిన స్నేహితులు

దుబాయ్: ఇద్దరు వ్యక్తులు, తమ స్నేహితుడ్ని హత్య చేశారు. దుబాయ్‌లోని ఎడారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేయడం ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో మొదటి నిందితుడు, తన స్నేహితుడ్ని చంపగా, రెండో నిందితుడు, మొదటి నిందితుడికి సహకరించాడని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ ఆసియాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మొదటగా ఓ నిందితుడు, బాధితుడి చేతుల్ని తాడుతో గట్టిగా కట్టేయగా, మరో నిందితుడు మెడకు బలంగా ఉరి వేశాడు. తప్పించుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా, గట్టిగా అతన్ని కొట్టి, అతని నోటిలో ఇసుకుని కూరేశారు. అనంతరం ఆ వ్యక్తిని ఇసుకలోనే పూడ్చిపెట్టేశారు నిందితులు. ఇసుక తిన్నెల్లో మృతదేహం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com