ఒమన్‌ క్రూడాయిల్‌ ధరలు పైపైకి

- September 25, 2018 , by Maagulf
ఒమన్‌ క్రూడాయిల్‌ ధరలు పైపైకి

మస్కట్‌: ఒమన్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 82 డాలర్లకు (బ్యారెల్‌) చేరుకున్నాయి. గత నాలుగేళ్ళలో ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. దుబాయ్‌ మర్కంటైల్‌ ఎక్స్‌ఛేంజ్‌ (డిఎంఇ) వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్‌ ఆయిల్‌ ధర నవంబర్‌ 2018 నాటికి 82.53 (బ్యారెల్‌). అంతకు ముందు ఈ ధర 80.02గా ఉంది. ఒక్క రోజులోనే 2.51 డాలర్ల మేర బ్యారెల్‌కి ధర పెరిగింది. 2015 తర్వాత బ్యారెల్‌ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. సెప్టెంబర్‌ నెలకుగాను ఒమన్‌ క్రూడ్‌ ఆయిల్‌ డెలివరీ యావరేజ్‌ ధర 73.17గా వుంది. ఆగస్ట్‌తో పోల్చితే 44 సెంట్స్‌ తక్కువ ఇది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com