ఒక్క రూపాయికే రూ.10 లక్షల బీమా!! వివరాలు చూడండి..
- September 25, 2018
ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని బీమా సంస్థలతో కలిసి ఈ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. అదేసమయంలో తన ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకునేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రైలు ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కల్పించింది.
ఈ-టికెట్ తీసుకునే ప్రయాణికులకు బీమాను ఆప్షన్‌గా మార్చింది. ఇకపై ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు బీమా కావాలా? వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేసింది. టికెట్ కోసం వివరాలు సమర్పించే సమయంలో ఇన్సూరెన్స్ కూడా ఒక ఆప్షన్‌గా ఇస్తుంది. కావాల్సిన వారికి రూ.1 అదనంగా వసూలు చేస్తారు.
ఆన్‌లైన్ విధానంలో టికెట్ బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్ నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ విధానం ఈ నెల 2 వరకు కొనసాగింది. దాదాపు 9 నెలల పాటు ప్రయాణికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించింది. ఖర్చులు పెరిగిపోవడంతో ఇటీవల ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెచ్చింది.
స్లీపర్, ఏసీ, చెైర్ కార్ సీట్ల కోసం టికెట్లు బుక్ చేసే ప్రయాణికులు బీమా కావాలా వద్దా? అన్నది ఇకపై వారికే వదిలేసింది. దీనికోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో రైల్వే శాఖ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే.. రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







