వేతనాలు చెల్లించని ఖతార్‌ ఫిఫా వరల్డ్‌ కప్‌ కాంట్రాక్టర్‌

- September 26, 2018 , by Maagulf
వేతనాలు చెల్లించని ఖతార్‌ ఫిఫా వరల్డ్‌ కప్‌ కాంట్రాక్టర్‌

ఖతార్‌:2022 ఫిఫా వరల్డ్‌ కప్‌కి సంబంధించి స్టేడియం నిర్మాణం చేపడ్తోన్న కాంట్రాక్టర్‌, కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపిస్తోంది. హక్కుల సంస్థ ఆమ్నెస్టీ, ఈ మేరకు ఓ రిపోర్ట్‌ని విడుదల చేసింది. మెర్క్యురీ మెనా, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. ఇండియా, నేపాల్‌, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల నుంచి వచ్చిన కార్మికులు ఈ కాంట్రాక్టర్‌ వద్ద పనిచేస్తున్నారు. ఖతార్‌ లుసైల్‌స్టేడియం పనుల్లోనూ వీరు పాల్గొంటున్నారు. అయితే లేబర్‌ మినిస్ట్రీ మాత్రం, ఖతార్‌లో మెర్యుకరీ మెనా ఎలాంటి కార్యకలాపాలు ప్రస్తుతం నిర్వహించడంలేదనీ, దీనిపై చట్ట పరమైన కోణంలో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. మెర్యురీ మెనా మాత్రం ఈ ఆరోపణలపై ఇంతవరకు స్పందించలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com