కొత్త రూట్‌ని ప్రకటించిన మవసలాత్
- September 26, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, కొత్త రూట్‌ని అల్ మాబిలా నుంచి బుర్జ్ అల్ సహ్వాకి ప్రకటించింది. రూట్ 10లో ఈ జర్నీ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ని మస్కట్ గవర్నరేట్‌లో మరింతగా విస్తరించే క్రమంలో ఈ రూట్‌ని ప్రకటించడం జరిగింది. అల్ మాబిలా స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ రూట్ అల్ షరాది, అల్ సీబ్ పోలీస్ స్టేషన్, అల్ సీబ్ మార్కెట్, అల్ అదియాత్ స్ట్రీట్, అల్ రావ్దా రౌండెబౌట్, అల్ నఖీల్ స్ట్రీట్, అల్ హైల్ నార్త్, అల్ ఇష్రాక్ రౌండెబౌట్, అల్ మవాలిహ్ నార్త్, తమీర్ స్ట్రీట్, సౌత్ మావాలిహ్ మార్కెట్, మావాలిహ్ మార్కెట్, బుర్జ్ అల్ సహ్వా మరియు అల్ మావాలిహ్ల మీదుగా సాగుతుంది. ఇదే రూట్లో తిరిగి వస్తుంది బస్. రువి నుంచి రూట్ 1లో వచ్చే ప్రయాణీకులు బుర్జ్ అల్ సహ్వా లేదా అల్ మవాలిహ్ వద్ద దిగి, రూట్ 10ని తీసుకోవచ్చు అల్ సీబ్ మార్కెట్ కోసం. ఫ్యామిలీస్, అలాగే విమెన్, డిజేబులిటీస్తో వున్నవారికి ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేశారు. ఉచిత వైఫై ఈ బస్సుల్లో అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి