ఒమన్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
- September 26, 2018
మస్కట్: ఒమన్‌లో రోడ్డు ప్రమాదాలు 7.3 శాతం వరకు తగ్గినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. 2017 ఆగస్ట్‌తో పోల్చితే 2018 ఆగస్ట్‌లో తగ్గిన ప్రమాదాల శాతం 7.3గా నమోదయ్యింది. 2018 ఆగస్ట్‌లో మొత్తం 215 ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాలు చెబుతున్నాయి. మస్కట్ గవర్నరేట్ పరిధిలో 26 శాతం ప్రమాదాలు ఈ ఆగస్ట్‌లో జరిగాయి. ఆ తర్వాతి స్థానం దఖ్లియాలో 16.7 శాతం, సౌత్ అల్ బతినా 12.6 శాతం, నార్త్ అల్ బతినాలో 11.2 శాతం ప్రమాదాలు జరిగాయి. మిగతా గవర్నరేట్స్‌లో 33.5 శాతం ప్రమాదాలు జరిగినట్లు నివేదిక చెబుతోంది. రాత్రి వేళల్లో 56 శాతం ప్రమాదాలు జరగగా, పగటి వేల 44 శాతం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2017 తో పోల్చితే మృతుల సంఖ్య పెరిగింది. 75 మంది చనిపోయారు. వీరిలో 30 మంది ఒమనీయులు కాగా, 45 మంది వలసదారులు. గాయపడ్డవారి సంఖ్య 238. వీరిలో 174 మంది ఒమనీయులు, 64 మంది వలసదారులున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







