ఆధార్‌కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

- September 26, 2018 , by Maagulf
ఆధార్‌కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఇండియా:ఆధార్‌కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ప్రకటించింది.. ఆధార్‌ చట్టబద్ధతను జస్టిస్‌ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం సమర్ధించింది. మెజార్టీ న్యాయమూర్తులు ఆధార్‌ సరైందే అని అభిప్రాయపడ్డారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆధార్‌ మంచి గుర్తింపు కార్డని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.. ఇతర గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్‌ చాలా మెరుగ్గా ఉందని సుప్రీం అభిప్రాయపడింది.. అయితే ఆధార్‌ జారీ విషయంలో పలు సూచనలు చేసింది..

ఒక వ్యక్తికి సంబంధించిన అంత్యత కీలక సమాచారాన్ని ఇతరుల చేతికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సుప్రీం స్పష్టం చేసింది.. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతికి ఇతరుల సమాచాం ఇవ్వొద్దని హెచ్చరించింది. అలాగే బ్యాంక్‌లకు ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆధార్‌ను తప్పని సరి చేయడం సరైంది కాదని అభిప్రాయపడింది. మరోవైపు మొబైల్‌ పోన్లకు కూడా ఆధార్‌ను లింకు చేయాల్సిన అవసరం ఏముందని సుప్రీం ప్రశ్నించింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com