డాక్టరేట్ అందుకున్న సోనూసూద్
- September 26, 2018
దిల్లీ: ప్రముఖ నటుడు సోనూసూద్ తైక్వాండోలో డాక్టరేట్ అందుకున్నారు. మంగళవారం దేశ రాజధాని దిల్లీలో జరిగిన 107 అంతర్జాతీయ క్యోరుగి రెఫరీ సెమినార్‌కు సోనూ సూద్ వెళ్లారు. ఈ సందర్భంగా తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ ప్రభాత్ శర్మ సోనూకు డాక్టరేట్‌ను అందించారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మీడియాతో మాట్లాడుతూ..'చాలా గర్వంగా ఉంది. చిన్నప్పుడు నేను తైక్వాండో శిక్షణకు వెళ్లిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. కానీ తైక్వాండోలో నాకు డాక్టరేట్ వస్తుందని ఊహించలేదు. ఇదంతా నేను ఎంపికచేసుకున్న యాక్షన్ సినిమాల వల్లే సాధ్యమైంది. ఎన్నో ఏళ్లుగా యాక్షన్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాను. ఇప్పటికీ అవే సినిమాలు చేస్తున్నాను. చిన్నప్పుడు తొలిసారి మా అమ్మ నాకోసం తైక్వాండో దుస్తులు కొనిచ్చి శిక్షణా తరగతులకు తీసుకెళ్లిన రోజులు గుర్తున్నాయి. ఈరోజు అమ్మ ఉండుంటే బాగుండు. నాకు డాక్టరేట్ రావడం చూసి ఎంతో సంతోషించేది. నాపై ఉన్న అమ్మ ఆశీర్వాదాలే మ్యాజిక్ చేసి నాకు డాక్టరేట్ వచ్చేలా చేశాయని అనిపిస్తోంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది' అని వెల్లడించారు సోనూ.
'పల్టాన్' అనే హిందీ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు సోనూ. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సి' సినిమాలో సోనూ సదాశివ్ అనే మరాఠా వీరుడి పాత్రలో నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో సోనూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు బయోపిక్‌లో సోనూ నటిస్తున్నారు. ఇందులో ఆయన బ్యాడ్మింటన్ ఛాంపియన్, సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సోనూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







