భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

- September 26, 2018 , by Maagulf
భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్: జంట నగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకపూల్, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ, తార్నాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, ఓయూ, విద్యానగర్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, లిబర్టీ, ఆర్టీసీక్రాస్‌రోడ్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హిమాయత్‌నగర్, రాజేంద్రనగర్, బుద్వేల్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, మైలార్‌దేవ్‌పల్లి తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నీటినిల్వను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. సమస్యలుంటే డయల్ 100కు గాని, కాల్‌సెంటర్ 040-21111111లకు ఫోన్ చేయాలని కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వర్షపు నీరు వచ్చిచేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.6కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com