పెళ్లి పీటలెక్కనున్న సైనా నెహ్వాల్‌

- September 26, 2018 , by Maagulf
పెళ్లి పీటలెక్కనున్న సైనా నెహ్వాల్‌

ఇటీవల కాలంలో సినిమా రంగం, క్రీడారంగానికి చెందిన వ్యక్తుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్‌ ఆటగాళ్లు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌లు త్వరలో ఒక్కటి కాబొతున్నారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్న సైనా-కశ్యప్‌ల వివాహానికి పెద్దలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. డిసెంబర్‌ 16న వివాహం, అదే నెల 21న రిసెప్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. వీరి పెళ్లికి కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల మాత్రమే హాజరవుతారని, కానీ హైదరాబాద్‌లో రిసెప్షన్ గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటివరకు సైనా-కశ్యప్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీరిద్దరూ 2005 నుంచి గోపిచంద్‌ అకాడమీలో బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

ఇద్దరూ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కాబట్టి వీరి ప్రేమ వ్యవహారం ఎక్కువగా వార్తల్లో నిలువలేదు. క్రీడారంగానికి చెందిన ఈ స్టార్స్ వివాహం చేసుకోబుతున్నారని తెలియగానే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 32 ఏళ్ల కశ్యప్‌ 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. 28 ఏళ్ల సైనా నెహ్వాల్‌ 2010, 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణాలు, 2012 ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు.

గతంలో దినేశ్‌-కార్తీక్‌- దీపికా పల్లికల్‌, గీతా ఫోగట్‌-పవన్‌ కుమార్‌, సాక్షి మాలిక్‌-సత్యవ్రత్ కాదియాన్‌, ఇశాంత్‌ శర్మ- ప్రతిమా సింగ్‌ ప్రేమ పెళ్లిల్లు చేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడి చేరబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com