ఫొటో తీస్తే 150,000 జరీమానా
- September 26, 2018
దుబాయ్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంఘటనల్ని ఫొటో తీయాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అలా ఫొటోలు తీసేవారికి 150,000 దిర్హామ్‌ల వరకు జరీమానా పడుతుంది. అబుదాబీ పోలీస్‌ఈ మేరకు నిబంధనల్ని ప్రస్తావిస్తూ, ఉల్లంఘనులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాల్ని ఫొటోల్లో బంధించాలనుకోవడం హేయమైన చర్య అని అబుదాబీ పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలీఫా మొహమ్మద్ అల్ ఖలిల్ చెప్పారు. కొందరు చేసే ఇలాంటి చర్యల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనీ, అది ఒక్కోసారి ప్రాణాల్ని బలికొనేంత ఆలస్యానికి కారణమవుతుందని ఆయన అన్నారు. యూఏఈ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం సోషల్ మీడియాలో ఎవరూ ప్రమాదాలకు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్ చేయరాదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







