వడ్డీ రేట్లు పెంచిన యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌

- September 27, 2018 , by Maagulf
వడ్డీ రేట్లు పెంచిన యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌

యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌ (సిబియూఏఈ) రెపో రేటుని 25 బేసిస్‌ పాయింట్లను పెంచింది. అలాగే సర్టిఫికేట్స్‌ ఆఫ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేట్లనూ పెంచింది. డాలర్‌ ధర పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సెంట్రల్‌ బ్యాంక్‌. రెపోరేట్‌, షార్ట్‌ టెర్మ్‌ లిక్విడిటీ అప్పుల్ని సిబియూఏఈ నుంచి సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌పై తీసుకున్నవారికి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. సిబియూఏఈ, దేశంలో నడుస్తున్న బ్యాంకులకు సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌ని జారీ చేస్తుంది. తాజా మార్పులతో వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com