‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ ఎవరిని అడిగి తీసారు: కుమారుడు ఫైర్

- September 27, 2018 , by Maagulf
‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ ఎవరిని అడిగి తీసారు: కుమారుడు ఫైర్

అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలను చిత్రాలుగా తీయడమంటే ఆషామాషీ కాదు. ఎవరినీ నొప్పించకుండా, వారికున్న ఇమేజ్ ఏ మాత్రం చెడకుండా, అన్నింటికీ మించి వారి కుటుంబ సభ్యుల నుంచి వారికి సంబంధించిన సమాచారాన్ని పక్కాగా సేకరించి, వివాదాలకు తావివ్వకుండా చిత్రాన్ని నిర్మించవలసి ఉంటుంది. ఒకవేళ వారి జీవితంలో ఏమైనా కాంట్రావర్షియల్ ఇష్యూస్ ఉన్నా వాటిని తెరపైకి తీసుకురారు.

మంచి మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో దర్శకుడు చాలా పెద్ద బాధ్యతనే మోయవలసి ఉంటుంది. తాజాగా ఘంటసాల జీవిత చరిత్ర తెరపైకి వచ్చింది. చిత్ర యూనిట్ ఘంటసాల ది గ్రేట్ అని సినిమా పేరుని కూడా సెట్ చేసేసారు. అలనాటి చిత్రాల్లోని ఆణిముత్యాలన్నీ ఆయన నోటి నుంచి జాలువారినవే. ఆయ గొంతు ఎంత మృదుమధురమైనదో మనిషి కూడా వెన్నలాంటి మనసున్న వ్యక్తి అంటారు. కొన్ని వందల గీతాలు ఆయన గొంతులో మాధుర్యాన్ని పలికించేవి అంటే అతిశయోక్తి కాదు. నేటి తరానికి ఆ మహానుభావుడి గురించి తెలియజేయాలని బయోపిక్ తీస్తున్నారు.

ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నాన్నగారి జీవితంపై సినిమాలు తీస్తూపోతే కుటుంబసభ్యులు మనోభావాలు దెబ్బతింటాయని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలని చట్టపరమైన చర్యలు తీసు కోబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com