పెట్రోల్ ధరల్ని పెంచిన యూఏఈ
- September 27, 2018
యూఏఈ:వాహనదారులు అక్టోబర్ నెలలో ఇంకాస్త ఎక్కువ మొత్తాన్ని పెట్రోల్ కోసం వినియోగించాల్సి వుంటుంది. అక్టోబర్ నెలకుగాను యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ నెలకుగాను పెట్రోల్ ధరల్ని పెంచడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 2.61 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఇప్పటిదాకా అది 2.59 దిర్హామ్‌లు మాత్రమే. 95 స్పెషల్ కేటగిరీ పెట్రోల్ ధర 2.48 దిర్హామ్‌ల నుంచి 2.50 దిర్హామ్‌లకు పెంచడం జరిగింది. డీజిల్ ధర 2.64 నుంచి 12 ఫిల్స్ పెరిగి, 2.76 దిర్హామ్‌లకు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







