ఆపద్ధర్మ ప్రభుత్వానికి మరోసారి క్లారిటీ ఇచ్చిన ఎలక్షన్ కమిషనర్
- September 27, 2018
తెలంగాణ:అసెంబ్లీ రద్దయిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. మళ్లీ కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు నియమావళి అమల్లో ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది ఈసీ. ఆపద్ధర్మ ప్రభుత్వాలకు కూడా ఈ నియమావళి వర్తిస్తుందని ఈసీ వెల్లడించింది. ఆపద్ధర్మ సీఎంగా విధానపరమైన, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని, కొత్త పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించకూడదని నియమావళిలో క్లారిటీ ఇచ్చింది. అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులు వినియోగించినా నిబంధనల నియమావళి ఉల్లంఘన కిందకే రానుంది.
సాధారణంగా అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి అమల్లో ఉంటుంది. కానీ, ఆపద్ధర్మ ప్రభుత్వాలకు కూడా ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎటువంటి విధానం ఉంటుందో.. ఆ విధానాలన్నీ కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు వర్తిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కనుక…కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్రంలోని అపద్ధర్మప్రభుత్వంగానీ ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త విధివిధానాలు ప్రకటించడం గానీ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉండదు.
తెలంగాణలో అసెంబ్లీ రద్దు తర్వాత అపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అపద్ధర్మ ప్రభుత్వాలు, కేర్ టేకర్ ప్రభుత్వం ఉండదని ప్రభుత్వం..ప్రభుత్వమేనని వాదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ లేఖకు ప్రధాన్యత ఏర్పడింది. సాధారణ ప్రభుత్వానికి, అపద్ధర్మ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసంపై ఈసీ క్లారిటీ ఇవ్వటంతో ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనేందుకు వీలు లేకుండా పోయింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







